Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రక్షకుండుదయించి నాడట మన కొరకు Telugu Christian Song Lyrics

రక్షకుండుదయించి నాడట మన కొరకు Lyrics

పల్లవి:
రక్షకుండుదయించి నాడట - మన కొరకు - బరమ రక్షకుండుదయించి

నాడట - రక్షకుండుదయించి నాడట - రారె - గొల్లబోయలార

తక్షణమున - బోయి మన నిరీక్షణ ఫలమొందెదము
..రక్షకుండు..

1.
దావీదు వంశమందు ధన్యుండు జన్మించినాడు దేవుడగు

యెహోవా మన దిక్కు జేరి చూచినాడు
..రక్షకుండు..

2.
గగనమునుండి దిగి - ఘనుడు గబ్రియేలు దూత తగినట్టు

చెప్పె వారికి మిగుల సంతోషవార్త
..రక్షకుండు..

3.
వర్తమానము జెప్పి దూత - వైభవమున బోవుచున్నాడు కర్తను

జూచిన వెనుక కాంతుము విశ్రమం బప్పుడు
..రక్షకుండు..

4.
పశువుల తొట్టిలోన - భాసిల్లు వస్త్రముల జుట్టి శిశువును

గనుగొందురని - శీఘ్రముగను దూత తెల్పె
...రక్షకుండు...

5.
అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు - అనుమతించి

కడకు క్రీస్తు నందరికినీ దెల్పినారు
...రక్షకుండు...

Your favourites

  • No Favourites found!