Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించినాఁడఁట రక్షకుం Telugu Christian Song Lyrics

రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించినాఁడఁట రక్షకుం Lyrics

రక్షకుండుదయించ్నాఁడఁట మనకొరకుఁబరమ రక్షకుం డుదయించి
నాఁడఁట రక్షకుం డుదయించినాఁడు రారె గొల్లబోయలార తక్షణమునఁ
బోయి మన ని రీక్షణ ఫల మొందుదము ||రక్షకుండు||

1. దావీదు వంశమందు ధన్యుడు జన్మించినాఁడు దేవుఁడగు యెహోవా
మన దిక్కుఁ దేరి చూచినాఁడు ||రక్షకుండు||

2. గగనమునుండి డిగ్గి ఘనుఁడు గబ్రియేలు దూత తగినట్టు చెప్పె వారికి
మిగుల సంతోషవార్త ||రక్షకుండు||

3. వర్తమానము జెప్పి దూత వైభవమున పోవుచున్నాఁడు కర్తను జూచిన
వెనుక కాంతుము విశ్రమం బప్పుడు ||రక్షకుండు||

4. పశువుల తొట్టిలోన భాసిల్లు వస్త్రములజుట్టి శిశువును గనుగొందురని
శీఘ్రముగను దూత తెల్పె ||రక్షకుండు||

5. అనుచు గొల్ల లొకరి కొక రానవాలు జెప్పుకొనుచు అనుమతించి
కడకుఁ క్రీస్తు నందరికినీ దెల్పినారు ||రక్షకుండు||

Your favourites

  • No Favourites found!