Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత Telugu Christian Song Lyrics

రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత Lyrics

రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును
పర్వత శిఖర శ్రేణులవలెనే నిశ్చలమైనది
1. మలిన వస్త్రమువలెనే - నిండియుంటిమి నిందలతో
తండ్రిమాదిరిగా మము వెదకివచ్చి వింతగా మమ్మురక్షించెను
2. అరణ్య ప్రదేశములో - పాడైన యెడారిలో
కనుగొనెను, పరామర్శించెన్ కనుపాపవలె గాచెన్
3. యాకోబువలె నుంటిమి - ఇశ్రాయేలుగా మార్చెను
తన స్వాస్థ్యముగా, తన భాగముగా తన జనముగానైతిమి
4. పర్వతములను సృజించెన్ - శ్రేష్టమైనవి నిచ్చెన్
అబ్రహాం మోషే ఏలియా యేసు ఎక్కిరి శిఖరములను
5. పక్షిరాజువలె ప్రభువు - రెక్కలతో మము మోయున్
అలసట లేక, మము పట్టుకొని ఆకసమున నడుపును
6. యేసుని సత్యములు - పర్వత శిఖరములు
పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరికింప జేయును
7. యేషయా ప్రవచనములు - రక్షణ వివరములు
శిఖర శ్రేణి యనుభవములు శిఖరముపై పొందుము


Your favourites

  • No Favourites found!