Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివాబ్రతుకిల మారినదానీ Telugu Christian Song Lyrics

రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివాబ్రతుకిల మారినదానీ Lyrics

రక్షణ పొందితివా నిరీక్షణ నొందితివా
బ్రతుకిల మారినదా-నీ భారం తీరినదా
1.ఎన్నాళ్లు పాపపు-బ్రతుకు
ఎందాక ఈ శాపపు పరుగు
అంతయు మరణమేగా
నీ అంతము నరకమేగా ||రక్షణ||
2.ఆగదు సమయం నీ రక్షణకై
ఆగదు మరణం నీ కోరికపై
అనువగు సమయమిదే
నీ రక్షణ సుదినమిదే ||రక్షణ||
3.ఎన్నాళ్లుగ ప్రభు నెదిరించితివో
ఎందాక ప్రభుని విసికించితివో
కొంచెము యోచించు
నీ వించుక గమనించు ||రక్షణ||
4.పాపము నుండి తిరుగుము నేడే
పాపిని ప్రభువా మన్నించు మని
పరితాపము పొంది
ప్రార్ధించుము ఈ దినమే ||రక్షణ||
5.ప్రేమమయుడు ప్రభువగు క్రీస్తు
ప్రాణము పెట్టెను సిలువలో నీకై
పాపము తొలగించున్
నీ శాపము పరిమార్చున్ ||రక్షణ||

Your favourites

  • No Favourites found!