Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో Telugu Christian Song Lyrics

రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు వాంఛతో Lyrics


రమ్మానుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి రమ్మనుచున్నాడు

1. ఎటువంటి శ్రమలందును ఆదరణ నీ కిచ్చునని
గ్రహించి నీవు యేసునిచేరినా
హద్దులేని యింపునొందెదవు

2. కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్
కారు మేఘమువలె కష్టములు వచ్చినను
కనికరించి నిన్ను కాపాడును

3. సొమ్మసిల్లు వేళలో బలమును నీ కిచ్చును
ఆయన నీ వెలుగు రక్షణ అయినందున
ఆలసింపక నీవు త్వరపడి రమ్ము

4. సకల వ్యాధులను స్వస్థపరచుటకు
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపల నిచ్చున్

Your favourites

  • No Favourites found!