Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస Telugu Christian Song Lyrics

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస Lyrics

రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస నమ్ముకడకు నెమ్మి
నడుపుమా మమ్ము నడుపు దీక్షతోఁబ రమ్ము విడిచి యాత్మస్వరూ
పమ్మున నరుదెంచిన దై వమ్ము నీవెకద యెహోవ ||రమ్ము||

1. లోకయాత్ర చేయునప్పుడు చీ కాకుపడిన మాకు నీవె మార్గ దర్శివై
వీఁక నొసఁగి మాకరంబుఁ జేకొని పరిశ్రమముఁబాపి సిలువఁ
బడినవానికడకు త్సేకమూని మమ్ముఁజేర్ప ||రమ్ము||

2. భక్తవన వసంతదైవమా నీయందుఁ బ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా
ముక్తిదాత యేసువిభుని రక్తమహిమఁ దెల్పియఘ వి ముక్తులనుగఁజేసి
మమ్ము యుక్తమార్గమందు నిలుప ||రమ్ము||

3. జీవితపుబాధ లెన్నియో పెనుఁబ్రోవులగుచు నావరించి మమ్ముఁ దా
కిన మాకు నీవె హితుఁడవగుచు భావమిచ్చి భయముఁదీర్చి జీవ మైన
యేసుపాద సేవకు మముసిద్ధపఱుప ||రమ్ము||

4. పలువిధంబులైన చింతలు చెలరేఁగి మమ్ము కలఁతపెట్టు నవసరం
బున వలనుచెడిన మామనముల మలయు వ్యాకులతను మాన్పి వలయు
నాదరణము నిచ్చు పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము||

5. తొలిప్రవక్త లెంద రెందఱో నీ ప్రేరణమునఁ బలికినట్టి వేదమందునఁ
గల నిగూఢ భావములను దెలుపు నొజ్జవీవెయగుటఁ దెలిపి వాని మమ్ము
జ్ఞాన కలితమతులఁ జేయుకొఱకు ||రమ్ము||

6. సడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను బలసమృద్ధి నుద్ధరించి మా
యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు లడఁచి ప్రేమఁ
జ్యోతిమాలోఁ గడుస్థిరముగ వెలుఁగజేయ ||రమ్ము||

7. స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా వుత యుగయుగంబు లతులభక్తిని న్నె
కొలుతుము క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య మృతికి
మృత్యువైనవాని వితతసింహపీఠిపైని ||రమ్ము||

Your favourites

  • No Favourites found!