Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు Telugu Christian Song Lyrics

రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు Lyrics

రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము నా
పెదవుల నీతి అగ్నిచే నంటఁ గ్రమ్మర నా నత్తి వదలి నీ కృపఁ బొంద
||రమ్ము||

1. నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతుఁ బన్ను గ నీ కృప ని
న్నెన్నఁ డెరుఁగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు
||రమ్ము||

2. తరమె యెన్నఁగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ
ప్రేమ నీతి పరిమితిచే ధరఁ దేజో వాసులకుఁ గలిగించుఁ గడు
వింత ||రమ్ము||

3. భవదీయ కృపను బాగుగఁ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక
తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నేఁ బొంద ||రమ్ము||

4. నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా'
యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నేఁ జేర
||రమ్ము||

Your favourites

  • No Favourites found!