Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము Telugu Christian Song Lyrics

రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము Lyrics

రండి మానవులారా రక్షకునిన మ్మండి వేగము ప్రియులారా రండి
పాపుల బ్రోచుటకు పర మండలంబును విడిచి యీ భువి మండలంబున
కరుగుదెంచిన మహాత్మున్ గనుగొని సుఖింపను ||రండి||

1. ఇలలో మానవులందరు పలువిధ పాపా శలలో మునిగి యుండిరి
తులువయగు సాతాను చెడ్డ వలను జిక్కినవారలన్ దన బలముతో విడి
పింప బ్రాణము బలిగబెట్టిన ప్రభుని యొద్దకు ||రండి||

2. పరముండు నరులందరికై మరణంబయ్యొ కరుణతోడను కొరతపై
మరలి మూడవదినమునందున మహిమతో నా ప్రభువులేచి తెరవజేసెను
మోక్షమార్గము శరణు జొచ్చినవారలకును ||రండి||

3. పాపభారంబు నుండి విడుదలనొంద ప్రాపుగోరినవారలు ప్రాప
కుండగు క్రీస్తునాధుని దాపుజేరి తపంబు జేసిన పాపభారము దీసి శాంతిని
గూర్చు యా ప్రభు నొద్దకిపుడే ||రండి||

4. భావమందున దెలియుడి మీరలు నిత్య జీవమార్గము గనుడీ పావ
నుండగు క్రీస్తు మిమ్మును పావనులుగా జేసి నూతన జీవము నొసంగి పర
మున జేర్చు మిమ్మును నిశ్చయముగా ||రండి||

Your favourites

  • No Favourites found!