రండి రండి సువార్తబోధ విన రారోజనులారా నిండు మనంబుల
కోర్కెలూరగను నిజరక్షకుఁడగు యేసునిఁ జేర ||రండి||
1. పాపము లెడ బాపను యిలకరిగిన ప్రభువు మహిమ వినుఁడి మీ మీ
పాపములను దలపోసి హృదయముల పశ్చాత్తాపపడి యా పరమగురుని
నామముద్వారా ననుసరించి ముంచడముఁ బొందు ||రండి||
2. తన మహిమను బలమును దైవత్వము తగ్గించుకొని వడి యప్పుడు
తన సేవకుఁడని మదిఁదలపోయని తగు నీతిని గనుఁడీ క్రీస్తుండును
బాప్తి స్తు డు యోహానునిచే మునుకొని యోర్దాన్నదిలో ముంచుటగని
||రండి||
3. మురియుచు క్రీస్తువు యోర్దాన్నదిలో ముంచబడినరీతి నిప్పుడు
గరిమెతో క్రీస్తుని నమ్మిన జనములు గైకొనుటది నీతి మరువక స్థిరముగ
మీ మనముల నెల్ల ప్పుడు నరమరవిడి క్రీస్తుని తగఁజేర ||రండి||
4. తల్లులు తమ బిడ్డల కాశీర్వాదము లిమ్మని తేగా నప్పుడు చల్లగ
బాలుర కాశీర్వాద మెసఁగె ప్రభు విదిగాక క్రీస్తుఁడు తొల్లి జనములకు
ముంచడ మిచ్చిన టెల్ల విధులలేదు వేదమున ||రండి||
5. అందుచేత వేదమున బాప్తిస్తుండనఁబడె యోహాను ఇప్పుడు పొందుగ
ముంచువారు బాప్తిస్తులు పొసగగ సరిగాను మీరలు నందఱు విన సత్య
వేదవాక్యము సందియములు విడి సాగి వేగమున ||రండి||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రండి రండి సువార్తబోధ విన రారోజనులారా Lyrics
Your favourites
- No Favourites found!
