Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడుప్రయాసపడి Telugu Christian Song Lyrics

రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడుప్రయాసపడి Lyrics

రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు
ప్రయాసపడి భారము మోయువారలు
ప్రభుని చెంతకు పరుగిడి వేగమే

1. యేసుని పిలుపు వినియు నింక యోచింపరేల
అవనిలో అగచాట్లపాలైన అబ్బదుశాంతి ఆత్మకు నిలలో ||రండి||

2. కరువు రణము మరణము చూచి కలుగదు మారుమనస్సు
ప్రవచనములు సంపూర్ణములాయెను యూదులు తిరిగి చ్చుచున్నారు ||రండి||

3. ప్రభుయేసు నీ కొరకై తనదు ప్రాణము నిచ్చెగదా
సిలువను రక్తము చిందించియును
బలియాయెను యాఘనుడు మనకై ||రండి||

4. యేసుని నామమునందే పరమ నివాసము దొరకును
ముక్తిని పాప విమోచనమును
శక్తిమంతుడు యేసే యిచ్చును ||రండి||

5. నేనే మార్గము, నేనే సత్యము నేనే జీవమును
నేను గాకింకెవరు లేరని యెంచి చెప్పిన యేసుని వద్దకు ||రండి||

Your favourites

  • No Favourites found!