పల్లవి:
రండి యుత్చాహించి పాడుదము - రక్షణదుర్గము మన ప్రభువే
1.
రండి కృతజ్ఞత స్తో్త్రముతో - రారాజు సన్నిధి కేగుదము
సత్ప్రభునామము కీర్తనలన్ - సంతోష గానము చేయుదము
...రండి...
2.
మన ప్రభువే మహదేవుండు - ఘన మహత్మ్యము గల రాజు
భూమ్యాగాధపు లోయలును - భూతల శిఖరములాయనవే
...రండి...
3.
సముద్రము సృష్టించె నాయననే - సత్యుని హస్తమే భువిఁ జేసెన్
ఆయన దైవము పాలితుల - ఆయన మేపెడి గొఱ్ఱెలము
...రండి...
4.
ఆ ప్రభు సన్నిధి మోకరించి - ఆయన ముందర మ్రొక్కుదము
ఆయన మాటలు గైకొనిన - నయ్యవి మీకెంత మేలగును
...రండి...
5.
తండ్రికుమార శద్ధాత్మకును - దగుస్తుతి మహిమలు కల్గుగాక
ఆదిని ఇప్పుడు నెల్లప్పుడు - నయినట్లు యుగములనౌను ఆమేన్
...రండి...
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
రండి యుత్చాహించి పాడుదము రక్షణదుర్గము Lyrics
Your favourites
- No Favourites found!
