Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రారాజు జన్మించే ఇలలోన యేసు రారాజు Telugu Christian Song Lyrics

రారాజు జన్మించే ఇలలోన యేసు రారాజు Lyrics


రారాజు జన్మించే ఇలలోన
యేసు రారాజు జన్మించే ఇలలోన (2)
ఈ శుభ సంగతిని – ఊరూ వాడంతా
రండీ మనమంతా చాటి చెప్పుదాం (2)
ఓ సోదరా… ఓ సోదరీ… (2)
విష్ యు హాప్పీ క్రిస్మస్
అండ్ వెల్కమ్ యు టు క్రిస్మస్ (2)       ||రారాజు||

అదిగదిగో తూర్పున ఆ చుక్కేమిటి సోదరా
గ్రంథాలను విప్పి దాని అర్దమేంటో చూడరా (2)
రాజులకు రారాజు పుడతాడంటూ
లేఖనాలు చెప్పినట్టు జరిగిందంటూ (2)
రాజాధి రాజుని చూడాలంటూ
(తూర్పు) జ్ఞానులంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

అదిగదిగో తెల్లని ఆ వెలుగేమిటి సోదరా
(అని) గొల్లలంత భయపడుతూ వణికిపోతు ఉండగా (2)
రక్షకుడు మీకొరకు పుట్టాడంటూ
గొల్లలతో దేవదూత మాట్లాడేనూ (2)
ఈ లోక రక్షకుని చూడాలంటూ
(ఆ) గొల్లలంత ప్రభు యేసుని చూడవచ్చిరి – (2)        ||ఓ సోదరా||

Your favourites

  • No Favourites found!