Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో Telugu Christian Song Lyrics

రారాజు వస్తున్నాడో జనులారా.. రాజ్యం తెస్తున్నాడో Lyrics


రారాజు వస్తున్నాడో
జనులారా.. రాజ్యం తెస్తున్నాడో
త్వరపడి వేగమే రండి
ప్రియులారా.. ప్రభుని చేరగ రండి
వస్తానన్న యేసు రాజు రాక మానునా
తెస్తానన్న బహుమానం తేక మానునా (2)       ||రారాజు||

పాపానికి జీతం రెండవ మరణం
అది అగ్ని గుండము అందులో వేదన (2)
మహిమకు యేసే మార్గము జీవము (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

పాపం చెయ్యొద్దు మహా శాపమయ్యేను
ఈ పాప ఫలితం ఈ రోగ రుగ్మతలు (2)
యేసయ్య గాయాలు స్వస్థతకు కారణం
యేసయ్య గాయాలు రక్షణకు మార్గం
అందుకే నమ్ముకో యేసయ్యను
పొందుకో నీ పాప పరిహారము (2)       ||వస్తానన్న||

కనురెప్ప పాటున కడబూర మ్రోగగా
పరమున ఉందురు నమ్మిన వారందరు (2)
నమ్మని వారందరు శ్రమల పాలవుతారు (2)
అందుకే నమ్ముకో యేసయ్యను
చేరుకో పరలోక రాజ్యంబును (2)       ||వస్తానన్న||

Your favourites

  • No Favourites found!