Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం క్రీస్తు Telugu Christian Song Lyrics

రాత్రింబవళ్లు పాడెదను యేసు నామం క్రీస్తు Lyrics

రాత్రింబవళ్లు పాడెదను
యేసు నామం - క్రీస్తు నామం
1. పురుగు వంటి నరుడ నాకు - ప్రభువు రాజ్య మియ్యదలచి
పరమునుండి ధరకేతెంచి - ప్రాణమున్ బలిగా నిచ్చె
2. ఎన్నిక లేని చిన్నమంద - భయపడకు నీవిలన్
ఘనమైన పరమతండ్రి - రాజ్యమివ్వ నిష్టపడెన్
3. పాప కూపమునందు నేను - పడి చెడి యుండగా
గొప్ప రక్షణ నిచ్చి పరమ - రాజ్యమందు చేర్చెను
4. నీతి హేనుడనైన నాకు - నీతి రాజ్యమివ్వదలచి
నీతి రక్షణ వస్త్రములను - ప్రీతి తోడ తొడిగెను
5. పేరుపెట్టి పిలచినన్ను - పరమ రాజ్యమును తండ్రి
వారసునిగా నన్ను జేసి - వైరినిల సిగ్గుపరచెన్
6. పరమందు దూతలు - వింత పొందునట్లుగా
ఏర్పరచుకొంటివి నరుని - నరుడు ఏపాటి వాడు?
7. దానియేలు షద్రక్ మేషాక్ - అబెద్నెగో యనువారలన్
చిన్నమందగా జేసి - రాజ్యమేల జేసెన్
8. ఎన్ని శ్రమలు వచ్చినను - సన్నుతింతు నా ప్రభున్
ఘనత మహిమ కర్హుడని - హల్లెలూయ పాడెదన్


Your favourites

  • No Favourites found!