Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
రవితేజుడా రమణీయుడా రాజిల్లువాడా సుందరుడా గుణశీలుడా Telugu Christian Song Lyrics

రవితేజుడా రమణీయుడా రాజిల్లువాడా సుందరుడా గుణశీలుడా Lyrics

రవితేజుడా రమణీయుడా రాజిల్లువాడా
సుందరుడా గుణశీలుడా నా యేసు రాజా
లోకానా సాటి నీకు ఎవ్వరయ్యా
నీ తోడుంటే  చాలు నాకు యేసయ్య  (2)

అనునిత్యము నిన్నే స్తుతింతునయ్యా
అనురాగము పంచే నా యేసయ్య  (2)
                                            || రవితేజుడా ||
1. అవహేళనలే నను వేధించగా
అనుక్షణము అవి నన్నే వెంటాడగా  (2)
అనునయించిన హక్కున చేరితివి
అవమానాలనే దీవెనలుగా చేసితివి (2)
                                       || అనునిత్యము ||
2. విడువక నా యెడల కృప చూపితివి
నీ పర్ణశాలలో నను దాచితివి  (2)
శోభిల్లిన నా హృదయం సంతసించగా
శోభాతిశయముగా నను మార్చితివి (2)
                                       || అనునిత్యము ||
3. ఆశ్చర్య కార్యములే చేసితివి
దయగల నీ ఆత్మతో నడిపించు (2)
రాజువైన దేవా నిను ఘనపరతును
నీ నామము నిత్యము సన్నుతింతును (2)
                                       || అనునిత్యము ||

Your favourites

  • No Favourites found!