Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు Telugu Christian Song Lyrics

ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు Lyrics

ఱేఁడు మెస్సీయ జన్మించెను శ్రీదా వీదు పురమున నుద్భువించెను
వేడుకతోడను బాడుఁడి పాటలు రూఢిగ సాతాను కాడిని దొలఁగింప
||ఱేఁడు||

1. మనకొఱకై శిశువు పుట్టెను అతఁడు మన దోషములను బోగొట్టెను
అనయంబు నతనిమీఁ దను రాజ్యపు భార ము నుంచఁబడె విమో
చనకర్త యితఁ డౌను ||ఱేఁడు||

2. పరలోక సైన్యంబు గూడెను మన వర శిశువును గూర్చి పాడెను
నరులయందున గరుణ ధర సమాధానంబు చిర దేవునికి బహు
మహిమ యటంచును ||ఱేఁడు||

3. కొమ్మ యెష్షయినుండి పుట్టెను చిగురు క్రమ్మర మొద్దున బుట్టెను
కమ్మొను దేవుని యా త్మమ్మును తెలివి జ్ఞా న మ్మలోచన మహ త్వ
మ్మొక్కుమ్మడినాతని ||ఱేఁడు||

4. సర్వశక్తి గల దేవుఁడు మరియు నుర్వియందు దయాస్వభావుఁడు
సర్వమహిమము గల్గు స్వర్గ లోకము వదలి గర్వముతో నిండిన సర్వంసహా
స్థలిపై ||ఱేఁడు||

5. వింతైన వాఁడుగ నుండెను కోరినంత సుందరత లేకుండెను చింతతోడను
మాయా సంగతులగు వారి యంతములేనట్టి యాపదను వీక్షించి ||ఱే
ఁడు||

6. చెదరిన గొఱ్ఱెల వెదకును వాని ముదమున మందలోఁ జేర్చును
సదయత యేసుండు జనితైక సుతుఁడు భా స్వదధిక విభుఁడాలో చన
కర్త జన్మించె ||ఱేఁడు||

7. అక్షయుండగు యేసు వచ్చెను మన రక్షణమ్మును సిద్ధపర్చెను
మోక్షము సరుణా క టాక్షమ్ముతో నియ్య నీక్షితియందున హెబ్రీ
వంశమునందు ||ఱేఁడు||

Your favourites

  • No Favourites found!