రుచి చూచి ఎరిగితిని
యెహోవా ఉత్తముడనియు (2)
రక్షకు నాశ్రయించి
నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి||
1. గొప్ప దేవుడవు నీవే
స్తుతులకు పాత్రుడ నీవే (2)
తప్పక ఆరాధింతున్
దయాళుడవు నీవే (2) || రుచి చూచి||
2. మహోన్నతుడవగు దేవా
ప్రభావము గలవాడా(2)
మనసార పొగడెదను నీ
ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి||
3. మంచి తనము గల దేవా
అతి శ్రేష్టుడవు అందరిలో(2)
ముదమార పాడెద నిన్ను
అతి సుందరడవనియు (2) || రుచి చూచి||
4. కృతజ్ఞతా చెల్లింతున్
ప్రతి దాని కొరకు నేను (2)
క్రీస్తుని యందే తృప్తి
పొంది హర్షించెదను (2) || రుచి చూచి||
5. ప్రార్ధింతును ఎడతెగక
ప్రభు సన్నిధిలో చేరి (2)
సంపూర్ణముగ పొందెదను
అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి||
