సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దేవుఁ డంచు సాక్ష్య మనఁగఁ
గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను
స్వామి రక్షించె నంచు ||సాక్ష్య||
1. దిక్కు దెసయు లేని నన్ను దేవుఁ డెంతో కనికరించి మక్కువతో నాకు
నెట్లు మశ్శాంతి నిచ్చినాఁడో ||సాక్ష్య||
2. పల్లెటూళ్ల జనుల రక్షణ భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల
కును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||
3. బోధ చేయలేను వాద ములకుఁ బోను నాక దేల నాధుఁ డేసు ప్రభుని
గూర్చి నాకుఁ దెలిసినంత వరకు ||సాక్ష్య||
4. పాపులకును మిత్రుఁ డంచుఁ బ్రాణ మొసఁగి లేచె నంచుఁ బావముల
క్షమించు నంచుఁ బ్రభుని విశ్వసించుఁ డంచు ||సాక్ష్య||
5. చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన ఘోరపాపు లైనఁ క్రీస్తు
కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య||
6. పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల ఇరుగు పొరుగు
వారి కెల్ల యేసు క్రీస్తు దేవఁ డంచు ||సాక్ష్య||
7. ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును
తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దేవుఁ Lyrics
Your favourites
- No Favourites found!
