సదాకాలము – నీ యందే నా గురి
(యేసయ్యా) సదాకాలము – నీ యందే నా గురి
నిలుపుచున్నాను (2)
అక్షయ కిరీటం పొందాలని
అనుక్షణం నే స్తుతియింతును (2)
ఆరాధనా ఆరాధనా
యేసయ్యా నీకే నా ఆరాధనా (2) ||సదాకాలము||
చుక్కాని లేని నావనై
సంద్రాన నే చిక్కుబడగా (2)
నా దరి చేరి – ఈ ధరలోన
నీ దరి నడిపించావే (2) ||ఆరాధనా||
అన్య జనులు ఏకమై
నిందలు నాపైన మోపినా (2)
నిందలు బాపి – నన్నాదుకొని
విడువని కృప చూపినావే (2) ||ఆరాధనా||
నాశనకరమైన ఊభిలో
నేను పది కృంగగా (2)
హస్తము చాచి – నను ఆదుకొని
(నీ) ఆత్మతో బలపరచినావే (2) ||ఆరాధనా||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సదాకాలము నీ యందే నా Lyrics
Your favourites
- No Favourites found!
