Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి Telugu Christian Song Lyrics

సజీవుడవైన యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి Lyrics


సజీవుడవైన యేసయ్యా
నిన్నాశ్రయించిన నీ వారికి
సహాయుడవై తృప్తి పరచితివే
సముద్రమంత సమృద్ధితో (2)
ఆనందించెద నీలో – అనుదినము కృప పొంది
ఆరాధించెద నిన్నే – ఆనంద ధ్వనులతో (2)

ధన రాసులే ఇలా – ధనవంతులకు – ఈ లోక భాగ్యము
దాచిన మేలులెన్నో – దయచేసినావే – ఇహ పరమున నాకు (2)
శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివి
శ్రేష్టమైన నీ వాగ్ధానములతో (2)         ||సజీవుడవైన||

క్షేమము నొందుటయే – సర్వ జనులకు – ప్రయాసగా మారే
క్షేమాధారము నీవై – దీర్ఘాయువుతో – సంతృప్తి పరతువు నన్ను (2)
నిత్య నిబంధనగా నీ వాత్సల్యమును చూపితివే
నిత్యమైన నీ సత్య వాక్యముతో (2)         ||సజీవుడవైన||

నలువది ఏండ్లు – నీ స్వాస్థ్యమును – మోసినది నీవే
నీ కృప కాంతిలో – నా చేయి విడువక – నడిపించుచున్నది నీవే (2)
పరమ రాజ్యములో మహిమతో నింపుటకు అనుగ్రహించితివే
పరిపూర్ణమైన నీ ఉపదేశమును (2)         ||సజీవుడవైన||

Your favourites

  • No Favourites found!