సమాధానము - దేవుని సమాధానము (2)
ఇష్టులైన మనుష్యులకు సమాధానము
దేవుని కిష్టులైన మనుష్యులకు సమాధానము (2)
1. దయగలదేవుడు - ఈ భువి - కరుదెంచెను
ప్రాణమిచ్చె సిలువలో - నిన్ను ప్రేమించి (2)
ఈ ప్రేమను ఎరిగి - నీవు విరిగిపోతే - సమాధానము
2. దుష్టులకు నెమ్మది - లేదనెను దేవుడు
శాంతి మార్గమును - వారెరుగరనెను
మారు మనస్సు పొందితే - వారికి దొరుకు - సమాధానము
3. ఒప్పుకొనుము నీ పాపము - యేసుని యొద్ద
క్షమియించి - పరిశుద్ధునిగా చేయును
అప్పుడు నీ ఆత్మలో పొందెదవు - సమాధానము
4. ఆయన ఉపదేశము - నవలంబించుము
హృదయములో - నుంచుకొనుము ఆ మాటలను
ఆయనతో సహవాసము - చేసిన యెడల - సమాధానము
5. చింతించవలదు - ఏ - విషయమందును
తెలియజేయుడి - దేవునికి విన్నపములతో
తలంపు హృదయములకు - కావలియుండును - సమాధానము
6. నిన్నాశీర్వదించి కాపాడు - దేవుడు
ప్రకాశింపజేయును - తన కృపాసన్నిధి
నిన్నాశీర్వదించి - యిచ్చు తన నామమున - సమాధానము
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సమాధానము దేవుని సమాధానము ఇష్టులైన మనుష్యులకు Lyrics
Your favourites
- No Favourites found!
