Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము Telugu Christian Song Lyrics

సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము Lyrics


సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును (2)

అబ్రామును అడిగెను ప్రభువప్పుడు
ఇస్సాకును అర్పణ ఇమ్మనెను (2)
నీ బిడ్డను సేవకు నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా       ||సమర్పణ||

ప్రభుని ప్రేమించిన పేదరాలు
కాసులు రెండిచ్చెను కానుకగా (2)
జీవనమంతయు దేవునికిచ్చెను (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా      ||సమర్పణ||

నీ దేహము దేవుని ఆలయము
నీ దేవుడు మలిచిన మందిరము (2)
సజీవ యాగముగా నిచ్చెదవా (2)
నీవిచ్చెదవా నీవిచ్చెదవా      ||సమర్పణ||

Your favourites

  • No Favourites found!