Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము Telugu Christian Song Lyrics

సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతిగానము Lyrics

సమస్త జనులారా మీరు
యెహోవాకు స్తుతిగానము పాడి
సంతోషముతో సన్నిధిలో
ఉత్సాహించుడి జయమనుచు (2) ||సమస్త||

తానెయొనర్చె మహకార్యములన్
పాపిని రక్షింప బలియాయెన్ (2)
శత్రుని రాజ్యము కూలద్రోసెను
స్మరియించుడి మీరందరును (2)
ఆయనను స్తుతియించుడి ||సమస్త||

జ్ఞాపకముంచుకో ఇశ్రాయేలు
విడిపించె నైగుప్తునుండి (2)
నలువది వత్సరములు నడిపించె
కానానుకు మిమ్ము చేర్చుటకు (2)
ఆయనను స్తుతియించుడి ||సమస్త||

మోషేకు తన సేవను నొసగె
యెహోషువా జయమును పొందె (2)
శత్రుని గెల్చి రాజ్యము పొందె
ఘనకార్యములను స్మరియించి (2)
ఆయనను స్తుతియించుడి ||సమస్త||

మీరే ప్రభుని స్వంత ప్రజలుగా
కొనె మిమ్ము తన రక్తముతో (2)
ఆత్మల చేర్చి సంఘము కట్టె
ఆ రీతిని కని స్మరియించు (2)
ఆయనను స్తుతియించుడి ||సమస్త||

పిలిచెను ప్రభువు సేవకు మిమ్ము
నేడే వినుమాయన స్వరము (2)
అర్పించుడి మీ జీవితములను
సాగిలపడి ఆయన యెదుట (2)
ఆయనను స్తుతియించుడి ||సమస్త||

Your favourites

  • No Favourites found!