Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను Telugu Christian Song Lyrics

సందేహమేల సంశయమదేల ప్రభు యేసు గాయములను Lyrics


సందేహమేల సంశయమదేల
ప్రభు యేసు గాయములను పరికించి చూడు
గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు (2)      ||సందేహమేల||

ఆ ముళ్ల మకుటము నీకై – ధరియించెనే
నీ పాప శిక్షను తానే – భరియించెనే (2)
ప్రవహించె రక్త ధార నీ కోసమే
కడు ఘోర హింసనొందె నీ కోసమే (2)      ||సందేహమేల||

ఎందాక యేసుని నీవు – ఎరగనందువు
ఎందాక హృదయము బయట – నిలవమందువు (2)
యేసయ్య ప్రేమ నీకు లోకువాయెనా
యేసయ్య సిలువ సువార్త చులకనాయెనా (2)      ||సందేహమేల||

ఈ లోక భోగములను – వీడజాలవా
సాతాను బంధకమందు – సంతసింతువా (2)
యేసయ్య సహనముతోనే చెలగాటమా
ఈనాడు రక్షణ దినము గ్రహియించుమా (2)      ||సందేహమేల||

లోకాన ఎవ్వరు నీకై – మరణించరు
నీ శిక్షలను భరియింప – సహియించరు (2)
నీ తల్లియైన గాని నిన్ను మరచునే
ఆ ప్రేమ మూర్తి నిన్ను మరువజాలునా (2)      ||సందేహమేల||

Your favourites

  • No Favourites found!