Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ Telugu Christian Song Lyrics

సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ Lyrics


సంగీత నాదముతో స్తోత్ర సంకీర్తనతో
నీ ప్రేమ గీతం పాడెద
నీ గోప్ప కార్యం చాటెద
నా జీవితం మార్చిన యేసయ్యా
ఈ నీ రుణం తీర్చుట ఎటులయ్యా           ||సంగీత||

నా కఠిన హృదయమున కారుణ్యమును నింపి
కలువలు పూయించిన కృపలను కొనియాడెద (2)
పాపములు క్షమియించి నను మార్చిన
దోషములు భరియించి దరిచేర్చిన         ||నీ ప్రేమ||

నా కష్ట సమయమున నా చెంతనే నిలచి
విడువక నడిపించిన విధమును వివరించెద (2)
క్షేమమును కలిగించి నను లేపిన
దీవెనలు కురిపించి కృపచూపిన          ||నీ ప్రేమ||

నా దుఃఖ దినములలో ఓదార్పు కలిగించి
కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెద (2)
వాక్యముతో దర్శించి బలపరిచిన
సత్యముతో సంధించి స్థిరపరిచిన         ||నీ ప్రేమ||

Your favourites

  • No Favourites found!