సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య సంపూజ్య సర్వజ్ఞ పరిశుద్ద దేవా ||సంపూర్ణ||
1. నిర్మల మనసు రంజిల్ల నిత్య పరమానందంబు నా యాత్మలో నెరపు
ధరణి శ్రమల నోర్పు నిమ్ము పాప పరితాప మనుదినం బభివృద్ధిపరచి
||సంపూర్ణ||
2. విశ్వాస సమృద్ధి నిమ్ము నాదు ఈశుండ శ్రీ యేసు ప్రేమ నెంచి సం
తోషంబుగ సేవించుటకు నీదు నాశీస్సు దయచేయు దాస పోషకుఁడా
||సంపూర్ణ||
3. నాలోఁ గృతజ్ఞత నింపు నన్నుఁ బాలించు ప్రభునికై బ్రతుకంగ
నిమ్ము చాల తనదు మహిమఁ బొగడి సర్వ కాలంబు దన వాక్కుఁ గని
పెట్టునట్లు ||సంపూర్ణ||
4. నా పాపములె యేసునాధున్ ఘోర తాపా నిర్యాణంబు లందింపఁ
జేసెన్ నా పాపములకు దుఃఖింతున్ దేవ కాపాడుమీ నన్నుఁ
బాపంబునుండి ||సంపూర్ణ||
5. పెక్కంత శుద్ధిని బొంది నేను ఇక్కట్లు నోడింప శక్తి నందిమ్ము చిక్కులఁ
బడి యుండునపుడు నీతి లోకమం దా సక్తి మిక్కుట పరచి ||సంపూర్ణ||
6. నీ రాజ్య ప్రవేశ మంది తండ్రి యా రాజ్య శుశ్రూష నిల నేర్చునట్లు
పరిశుద్ధాత్మ సహాయ మిమ్ము యేసు ధరణి నీవలె నేను వర్తించునట్లు
||సంపూర్ణ||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సంపూర్ణ పరిశుద్ధి నిమ్ము సత్య సంపూజ్య Lyrics
Your favourites
- No Favourites found!
