Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంపూర్ణ రక్షణయూట పొంగుచున్నది చూడుముప్రవహించే రక్షకుని Telugu Christian Song Lyrics

సంపూర్ణ రక్షణయూట పొంగుచున్నది చూడుముప్రవహించే రక్షకుని Lyrics

1. సంపూర్ణ రక్షణయూట - పొంగుచున్నది చూడుము
ప్రవహించే రక్షకుని ప్రక్క - గాయమునుండి ఎల్లెడల
సంపూర్ణ రక్షణ ప్రవహించె - శాశ్వత రక్తనదులు
2. హా! మహిమ ప్రత్యక్షత చూడు ఎడతెగని ప్రవాహము
శిక్షయును మచ్చల కడిగెను - హిమముకంటె ధవళముగా
పూర్ణరక్షణ నెరుగుటచేత - ఆశీర్వాదములు కల్గున్
3. అడ్డులేని ప్రేమ ప్రవాహం - ప్రవహించె నన్ని చోట్ల
శుద్ధముగానుంచును తలంపులను - వాంఛలను సదాకాలం
పాపమలిన శక్తినుంచి - సంపూర్ణమగు రక్షణ
4. నిత్యమోక్ష జీవము దిగెను - నా హృదయ ఆలయమందు
దేవుడు నరుడైక్యపడుట - ఆహా! ఎంతటి స్నేహమిది
క్రీస్తుతో దివ్యజీవమునకు - జేర్చబడిన రక్షణ
5. దుఃఖము చీకటి భయము సిగ్గు - చింత నావిక కానేరవు
నా రక్షకుడు ముందు నడుచును చీకటి లేదు విశ్వాసములో
సర్వసంపూర్ణమగు రక్షణ - శాశ్వతమగు రక్షణ


Your favourites

  • No Favourites found!