Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ Telugu Christian Song Lyrics

సంతోషం యేసు వందనం నీవిచ్చిన ఈ Lyrics


సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై

సంతోష వస్త్రం మాకు ధరియింపజేశావు
మా దుఃఖ దినములు సమాప్తపరచావు (2)
సంతోషం యేసు వందనం
నీవిచ్చిన ఈ సంతోష వస్త్రముకై
స్తుతి స్తోత్రం ప్రతి నిత్యం
మా దేవా నీకే అర్పితం           ||సంతోష||

నిత్య సుఖములు కలవు నీ సన్నిధిలో
దీవెన కలదు నీ ప్రతి మాటలో (2)
విడువను ఎడబాయనని
వాగ్ధానమిచ్చి బలపరచావు (2)           ||సంతోషం||

రక్షణ ఆనందం మాకిచ్చావు
మా క్రయ ధనమంతా చెల్లించావు (2)
ఏ తెగులు నీ గుడారమును
సమీపించదని సెలవిచ్చావు (2)           ||సంతోషం||

Your favourites

  • No Favourites found!