Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు Telugu Christian Song Lyrics

సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుడు Lyrics


సంతోషముతో నిచ్చెడు వారిని
నెంతో దేవుడు ప్రేమించెన్
వింతగ వలసిన-దంతయు నొసంగును
వినయ మనసుగల విశ్వాసులకును              ||సంతోషముతో||

అత్యాసక్తితో నధిక ప్రేమతో
నంధకార జను-లందరకు
సత్య సువార్తను జాటించుటకై
సతతము దిరిగెడు సద్భక్తులకు              ||సంతోషముతో||

వేద వాక్యమును వేరు వేరు గ్రా
మాదుల నుండెడు బాలురకు
సాధులు ప్రభుని సు-బోధలు నేర్పెడి
సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు              ||సంతోషముతో||

దిక్కెవ్వరు లేకుండెడి దీనుల
తక్కువ లన్నిటి దీర్చుటకై
నిక్కపు రక్షణ – నిద్ధరలో నలు
ప్రక్కలలో బ్రక-టించుట కొరకై              ||సంతోషముతో||

ఇయ్యండీ మీ కీయం బడు నని
యియ్యంగల ప్రభు యే-సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని
యియ్యవలెను మన యీవుల నికను              ||సంతోషముతో||

భక్తి గలిగి ప్రభు పని కిచ్చుఁట బహు
యుక్త మటంచు ను-దారతతో
శక్తి కొలది మన భుక్తి నుండి యా
శక్తితో నిరతము నియ్య వలెను              ||సంతోషముతో||

Your favourites

  • No Favourites found!