Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంవత్సరములు వెలుచుండగా నిత్యము Telugu Christian Song Lyrics

సంవత్సరములు వెలుచుండగా నిత్యము Lyrics

సంవత్సరములు వెలుచుండగా
నిత్యము నీకృపతో ఉంచితివా
దినములన్ని తరుగుచుండగా
నీ దయతో నన్ను కాచితివా

నీకే వందనం నను ప్రేమించిన యేసయ్య
నీకేస్తోత్రము నను రక్షించిన యేసయ్య  (2)
                                    ||నీకే వందనం||
1. గడచిన కాలమంతా
నీ చల్లని నీడలో నడిపించినావు
నే చేసిన పాపమంతా
కలువరి సిలువలో మోసినావు  (2)
శత్రువుల నుండి విడిపించినావు
సంవత్సరమంతా కాపాడినావు (2)
                                    ||నీకే వందనం||
2. బ్రతుకు దినములన్నీ
ఏలీయా వలే నన్ను పోషించినావు
పాతవి గతియింపజేసి
నూతన వస్త్రములు దరియింపజేసావు (2)
నూతన క్రియలతో నను నింపినావు
సరికొత్త తైళముతో నను అంటినావు  (2)
                                     ||నీకే వందనం||

Your favourites

  • No Favourites found!