సందియము వీడవే నా మనసా యా నందమున గూడవే సందియము
లింకేల నిను సుఖ మొందఁ జేసెడు క్రీస్తు రక్తపు బిందువులు శుభవార్తవాక్యము
లందుఁ గని తెలి వొంది బ్రతుకుచు ||సందియము||
1. చింత లిఁక మానుము లోకులు దెల్పు భ్రాంతుల్ బడఁ బోకుము
ఎంత వింత దురంత పాపము లంతటను దన రక్తమున గో రంత
లేకయె దుడుచు నని సి ద్ధాంత మగు ప్రభు వాక్యమును విని ||సందియము||
2. పాపములు వీడుము నీ విఁకఁ బశ్చా త్తాపమున గూడుము ఏపు
మీరిన యోర్పుతో నొక పాపి కైన లయంబుఁ గోరక పాపులందఱు దిరిగి
వచ్చెడు కోపుఁ గోరెడు కర్త దరిఁ జని ||సందియము||
3. నేరముల నెంచుకో యేసుని కరుణా సారముఁ దలంచుకో భార
ముల్ మోయుచు శ్రమన్ బడు వార లందఱు నమ్మి నా దరిఁ జేర విశ్రమ
మిత్తునను ప్రభు సార వాక్కెలు చక్కఁగా విని ||సందియము||
4. నిమ్మళము నొందుము రక్షకుని పలుకు నమ్ముకొని యుండుము
ఇమ్మహిని బాపులకు నై ప క్షమ్ము జేసి పరాత్పరుని సము ఖమ్మునందుఁ
చిత్తమ్ముగాఁ కాయమ్ము బలియుడు నీప్రభునిఁ గని ||సందియము||
5. ప్రేమ దయా శాంతముల్ కర్తకు భూషా స్తోమము లవంతముల్ నీ
మొఱ ల్విని యేసునాధ స్వామి తన రక్తమున బాపముఁ దోమి ని న్నకళంకుఁ
జేయును నీ మదిన్ దగ నమ్ముకొన యిఁక ||సందియము||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సందియము వీడవే నా మనసా యా Lyrics
Your favourites
- No Favourites found!
