Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితోకన్నతండ్రి కావుమా Telugu Christian Song Lyrics

సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితోకన్నతండ్రి కావుమా Lyrics


1.
సన్నుతింతుమో ప్రభో సదమలమగు భక్తితో
కన్నతండ్రి కావుమా కలుషము నెడబాపుమా||

2.
నీతిసూర్య తేజమా జ్యోతిరత్న రాజమా
పాతకజన రక్షకా పతితపావన నామకా|

3.
మానవ సంరక్షకా దీన నిచయ పోషకా
దేవమానవ నందనా దివ్య సుగుణ మందనా||

4.
ప్రేమ తత్వభోధకా క్షేమదాత వీవెగా
కామిత ఫలదాయక స్వామి యేసు నాయక||

5.
పాపచింతలన్నిటిన్ పారదోలుమో ప్రభో
నీ పవిత్ర నామమున్ నిరతము స్మరియించెదన్||

Your favourites

  • No Favourites found!