Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివిదావీదును కోరుకొని Telugu Christian Song Lyrics

సంస్తుతింతుము నిన్నే సౌలును విడచితివిదావీదును కోరుకొని Lyrics

1. సంస్తుతింతుము నిన్నే - సౌలును విడచితివి
దావీదును కోరుకొని - దీవించిన యెహోవా
2. యెష్షయి పుత్రులలో - ఎర్రని వాడతడు
నేత్రాలు చక్కనివి - నేర్పరి మాటలలోన
3. రత్నవర్ణుడు యేసు - మాటలు దయగలవి
గువ్వలవలె వెలయు - కన్నులు గలవాడేసు
4. బెత్లెహేమునందు - ఖ్యాతిగా వాయించి
సొంపగు పాటలు పాడే - సుగుణాల సుందరుడు
5. పరమగీతము పాడే - పావనుడు మన యేసు
నేర్పరి మాటలలోన - నజరేతు నివాసి
6. వీరుడగు యౌవనుడు - శూరుడు యుద్ధమున
తల్లిని మించి యెహోవా - తనతోడై యున్నాడు
7. నేను కోరిన దితడే - వాని అన్నలముందు
అభిషేక తైలముతో - అభిషేకించుము వాని
8. సంఘవరుడగు క్రీస్తు - సత్యముగ మన శిరస్సు
ఆత్మాభిషిక్తుండై - అలరారుచున్నాడు


Your favourites

  • No Favourites found!