సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక వింతయగు
కీర్తనఁ బాడ వచ్చితిని సంతోషించుఁడి నాతో ||సంతో||
1. అంధకార మయమైన భూమి నా ద్యంతము వెలిఁగింప దాని యా
వేశముఁ దొలఁగింప వందితుండు క్రీస్తేసు నాధుఁడు వచ్చెఁ బ్రకాశుండై
భూమికి నిచ్చె ప్రకాశంబు ||సంతో||
2. కాన నంధకారంబు దొలఁగఁ ప్ర కాశించెను లెండు మీరు ప్ర
కాశింపను రండు మానవులను సంతోషపర్చనై మహిని నవతరించె
భక్తుల మనము సంతసించె ||సంతో||
3. మిన్ను నుండి సంతోషోదయము మిగుల ప్రకాశించె హృదయములఁ
దగులఁ ప్రకాశించె మున్ను జేయఁబడిన వాగ్ధత్తము తిన్నగ నెరవేరె
భక్తుల కన్ను లాస దీరె ||సంతో||
4. ప్రీతియైన నీ పండుగ గూర్చి నూతన కీర్తనను గలసికొని నాతోఁ
పాడుచును నీ తరి దూరస్థుల కీ వార్తను నే తీరును నైనఁ దెలుపఁగ
నాతురపడవలెను ||సంతో||
5. పాపులపై దేవునికిఁ గలిగిన ప్రబలమైన దయను లోకమునఁ జూపింపఁ
గవలెను జూపకపోయిన లోపము మనపై మోపఁబడును నిజము
వేగము జూపుద మా పథము ||సంతో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సంతోషించుఁడి యందరు నాతో సంతోషించుఁడి యొక Lyrics
Your favourites
- No Favourites found!
