Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు Telugu Christian Song Lyrics

సంతోషమే సంతోషమే సంతోషముతో స్తుతించెదన్ క్రీస్తు Lyrics

సంతోషమే సంతోషమే - సంతోషముతో స్తుతించెదన్
క్రీస్తు యేసు రక్షించినన్ - చేర్చెను తన మందలో
1. ఘోర దుర్మార్గుడనై - దారితప్పి యుండగా
భూరి దయతో కాపరి యేసు - దారికి నడిపెను
2. అక్షయమైనదియు - నిర్మలమైనదియు
రక్షకుడేసు వాడబారని స్వాస్థ్యము నా కిచ్చున్
3. భయమేమి లేదికను - ప్రభు చిన్న మందకు
దయ కృపతో రాజ్యమివ్వ - తండ్రికిష్టమాయెన్
4. మంటి పురుగునకు - మింట రాజ్యమివ్వ
మింటనుండి మంటి కేతెంచి - మరణ మొందె నేసు
5. దేవా నీ తలంపులు - నాకు ప్రియమైనవి
శోధింప నెంతో అశక్యములు - అగమ్యములు
6. నిజకుమారుడేసున్ - మన కనుగ్రహించెను
రాజ్యముతో బాటు సమస్తము నివ్వ - వెనుదీయునా?
7. మహిమ రాజ్యమునకు - మిమ్మును పిలుచుచున్న
మహిమ రాజుకు తగినట్టుగా మీరు - నడుచుకొనుడి
8. రాజాధిరాజు యేసే - ప్రభుల ప్రభు యేసే
పరమందు దూతలు - యిహమందు నరులు హల్లెలూయ పాడుడి


Your favourites

  • No Favourites found!