సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుఁడు ప్రేమించున్ వింతగ
వలసిన దంతయు నొసంగును వినయ మనసుగల విశ్వాసులకును
||సంతోషముతో||
1. అత్యాసక్తితో నధికప్రేమతో నంధకార జను లందఱకు సత్య సువార్తను
జాటించుటకై సతతము దిరిగెడు సద్భుక్తులకు ||సంతోషముతో||
2. వేదవాక్యమును వేరు వేరు గ్రా మాదుల నుండెడు బాలురకు సాధులు
ప్రభుని సు బోధలు నేర్పెడి సజ్జన క్రైస్తవోపాధ్యాయులకు ||సంతోషముతో||
3. దిక్కెవ్వరు లేకుండెడి దీనుల తక్కువ లన్నిటిఁ దీర్చుటకై నిక్కపు రక్షణ
నిద్ధరలో నలు ప్రక్కలలోఁ బ్రక టించుట కొఱకై ||సంతోషముతో||
4. ఇయ్యండీ మీ కీయం బడు నని యియ్యంగల ప్రభు యే సనెను
ఇయ్యది మరువక మదిని నుంచుకొని యియ్యవలెను మన యీవుల
నిఁకను ||సంతోషముతో||
5. భక్తిగలిగి ప్రభు పని కిచ్చుట బహు యుక్త మటంచు ను దారతతో
శక్తికొలఁది మన భుక్తి నుండి యా సక్తితో నిరతము నియ్య వలెను
||సంతోషముతో||
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సంతోషముతో నిచ్చెడు వారిని నెంతో దేవుఁడు Lyrics
Your favourites
- No Favourites found!
