Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సరి రారెవ్వరు నా ప్రియుడైన Telugu Christian Song Lyrics

సరి రారెవ్వరు నా ప్రియుడైన Lyrics

సరి రారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు (2)
సర్వము నెరిగిన సర్వేశ్వరునికి
సరిహద్దులు లేని పరిశుద్ధునికి (2) ||సరి||

1. నమ్మదగిన వాడే నలు దిశల
నెమ్మది కలుగ చేయువాడే (2)
నాజీరు వ్రతము జీవితమంతా
అనుసరించినాడే (2)
నాకై నిలువెల్ల సిలువలో
నలిగి కరిగినాడే (2)  ||సరి||

2. ఆరోగ్య ప్రదాతయే సంపూర్ణ
స్వస్థత అనుగ్రహించువాడే (2)
ఆశ్చర్య క్రియలు జీవితమంతా
చేయుచు తిరిగినాడే (2)
నాకై కొరడాల దెబ్బలను
అనుభవించినాడే (2) ||సరి||

3. పునరుత్థానుడే జయశీలి
మృతిని గెలిచి లేచినాడే (2)
శ్రేష్టమైన పునరుత్థాన
బలము ఇచ్చినాడే (2)
నాకై అతి త్వరలో మహిమతో
రానైయున్నవాడే (2)    ||సరి||

Your favourites

  • No Favourites found!