1. సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర సంతోషమా
స్తొత్రముచేసి స్తుతించెదను సంతసమున నిను పొగడెదను
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా యని పాడెదను
ఆనందముతో సాగెదను నే నానందముతో సాగెదను
2. ప్రేమించి నన్ను వెదకితివి ప్రీతితో నను రక్షించితివి
పరిశుద్ద జీవితము చేయుటకై పాపిని నను కరుణించితివి
3. అల్పకాల శ్రమలనుభవింప అనుదినము కృప నిచ్చితివి
నాధుని అడుగుజాడలలో నడచుటకు నను పిలచితివి
4. మరణ శరీరము మార్పునొంది మహిమ శరీరము పొంధుటకై
మహిమాత్మతో నను నింపితివి మరణ భయములను తీర్చీతివి
5. భువినుండి శ్రేష్ఠ ఫలముగను - దేవునికి నిత్య స్వాస్థ్యముగా
భూజనములలో నుండినను - ప్రేమించి క్రయధన మిచ్చితివి
6. ఎవరు పాడని గీతమును - యేసుని గూర్చి పాడుటకై
హేతువు లేకయే ప్రేమించెను - యేసుకు నేనేమివ్వగలను
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సర్వ కృపానిధీయగు ప్రభువా సకల చరాచర Lyrics
Your favourites
- No Favourites found!
