Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వ శరీరుల దేవుడా నీకసాధ్యమే లేదయ్యా Telugu Christian Song Lyrics

సర్వ శరీరుల దేవుడా నీకసాధ్యమే లేదయ్యా Lyrics


సర్వ శరీరుల దేవుడా
నీకసాధ్యమే లేదయ్యా (2)
చాచిన నీ బాహువుతో
భూమి ఆకాశాలు చేసితివే
నిన్న నేడు నిరంతరం – ఏకరీతిగుంటివే

లేనే లేదయ్యా హో యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా
లేనే లేదయ్యా మా యేసయ్యా
నీకసాధ్యమైనదేది లేదయ్యా (2)       ||సర్వ శరీరుల||

ఆదాము హవ్వలను చేసినట్టి దేవా
సృష్టికర్త నీకే స్తోత్రము
హేబెలు అర్పణను అంగీకరించిన
గొర్రెపిల్ల దేవా స్తోత్రము
హానోకును నీతో కూడా నడిపినావు
నోవాహును ప్రళయ జలము నుండి కాచినావు
సర్వశక్తుడా – నీతిమంతుడా
మార్పు లేని మా దేవుడా         ||లేనే లేదయ్యా||

అబ్రహాముతో నిబంధనను చేసినావు
అబ్రహాము దేవా స్తోత్రము
ఇస్సాకే వాగ్ధాన పుత్రుడన్నావు
ఇస్సాకు దేవా స్తోత్రము
యాకోబును ఇశ్రాయేలుగా మార్చినావు
యోసేపును పెద్ద రాజుగా చేసినావు
శ్రీమంతుడా – యాకోబు దేవుడా
చూచుచున్న మా దేవుడా         ||లేనే లేదయ్యా||

మోషేతో పొద నుండి మాటలాడినావుగా
ఉన్నవాడా నీకే స్తోత్రము
ఎర్ర సంద్రమున్ రెండు పాయలుగా చీల్చినావు
భీకరుండా నీకే స్తోత్రము
యెహోషువాకై సూర్య చంద్రులను ఆపినావు
కాలేబుకు యవ్వన బలమును ఇచ్చినావు
మేఘ స్థంభమా – అగ్ని స్థంభమా
చీల్చబడిన బండ దైవమా         ||లేనే లేదయ్యా||

గిద్యోను సైన్యముకు జయమునిచ్చినావుగా
విజయశీలుడా స్తోత్రము
సమ్సోనుకు సింహ బలమునిచ్చినావుగా
యూదా సింహమా స్తోత్రము
బోయజుతో రూతును విమోచించినావు
సమూయేలును మందసం నుండి పిలిచినావు
పరిశుద్ధుడా – విమోచకుడా
ఎబినేజరు స్తోత్రము         ||లేనే లేదయ్యా||

దావీదు నా హృదయానుసారుడంటివే
రాజాధి రాజా స్తోత్రము
సొలొమోనుకు ఆత్మ జ్ఞానమెంతో ఇచ్చినావు
అనంత జ్ఞాని స్తోత్రము
ఏలీయాకై అగ్ని పంపి నీవు గెలచినావు
ఎలీషాకు రెండంతలాత్మనిచ్చినావు
ఆత్మ రూపుడా – రోషవంతుడా
జీవము గల దేవుడా         ||లేనే లేదయ్యా||

నెహెమ్యాతో పడిన గోడలు కట్టించినావు
యెరూషలేము దేవా స్తోత్రము
జెరుబ్బాబెలునడ్డగించు కొండ నణిపినావు
మందసపు దేవా స్తోత్రము
ఎస్తేరుచే రాజు ఆజ్ఞనే మార్చినావు
దానియేలును సింహాల నుండి బ్రోచినావు
షద్రక్ మేషాకూ- అబేద్నెగోల దేవుడా
నిత్య రాజ్య స్థాపకుడా         ||లేనే లేదయ్యా||

యెహోషాపాతుకై పోరు సలిపినావు
యుద్ధ శూరుడా స్తోత్రము
యబ్బేజు సరిహద్దులిస్తరించినావుగా
యజమానుడా స్తోత్రము
హిజ్కియాకు ఆయుష్షు నీవు పెంచినావు
యెషయాకు దర్శనమును చూపినావు
మహిమ రూపుడా – నిత్య జీవుడా
సింహాసనాసీనుడా         ||లేనే లేదయ్యా||

యోబుకు రెట్టింపు దీవెనిచ్చినావుగా
నమ్మదగిన దేవా స్తోత్రము
యోనాను చేప కడుపు నుండి లేపినావుగా
దీర్ఘశాంతుడా స్తోత్రము
యెహేజ్కెలుపై నీ ఆత్మ హస్తముంచినావు
యోహానును త్రోవ సరళ పరచ పంపినావు
ప్రవచనాత్ముడా – మనుష్య కుమారుడా
ప్రవక్తలందరికి దేవుడా         ||లేనే లేదయ్యా||

కృపా సత్యములు మాకై తెచ్చినావుగా
యేసు దేవా నీకే స్తోత్రము
తండ్రి చిత్తము అంత నెరవేర్చినావుగా
దేవ తనయుడా స్తోత్రము
రక్తధారతో మా పాపమంతా కడిగినావు
మృత్యుంజయుడవై సమాధి గుండె చీల్చినావు
పునరుత్థానుడా – అభిషిక్తుడా
పాపుల రక్షకుడా         ||లేనే లేదయ్యా||

పేతురును బండలా స్థిరము చేసినావుగా
పరిశుద్ధాత్ముడా స్తోత్రము
సౌలును అపొస్తలునిగా మార్చినావుగా
ఆశ్చర్యకరుడా స్తోత్రము
యోహానుకు నీ రాజ్య మహిమ చూపినావు
సంఘానికి ఇప్పుడు తోడుగా ఉండినావు
పెండ్లి కుమారుడా – ప్రేమ రూపుడా
రానున్న మా దేవుడా         ||లేనే లేదయ్యా||

Your favourites

  • No Favourites found!