Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వ సృష్టికి ఆదిశంభూతుడవు Telugu Christian Song Lyrics

సర్వ సృష్టికి ఆదిశంభూతుడవు Lyrics

సర్వ సృష్టికి ఆదిశంభూతుడవు
వాక్యమై యున్న దేవుడవు
నిరంతర స్తోత్రార్హుడవు
సర్వాధికారి అయిన దేవుడవు
సంఘమునకు శిరసైన వాడవు
స్వరక్తమిచ్చినా దేవుడవు

రాజులకు రాజువు ప్రభులకు ప్రభుడవు
ఘనత మహిమ స్తోత్రం నీకే చెల్లును (2)

ప్రతి మోకాలు నీకై ఒంగును
ప్రతి నాలుక నీకైపాడును (2)  || సర్వ సృష్టికి ||

1. లోక పాపములు మోయుటకు
కన్య గర్భాన యేసుగా జన్మించిన దైవమా (2)
దావీదు కుమారుడౌ అబ్రహాము కుమారుడౌ
గలనీయుడవు నజరేయుడ నీవే
కరుణామయుడవు కృపగల దేవుడవు
ప్రేమ గలవాడవు పరిశుద్ధుడ నీవే

ప్రతి మోకాలు నీకై ఒంగును
ప్రతి నాలుక నీకైపాడును (2)  || సర్వ సృష్టికి ||

2. మనుషులకు తోడుగా ఉండుటకు
ఇమ్మానియేలుగా వచ్చిన దేవుని కుమారా (2)
దాసుడవు మహాదేవుడవు
అభిషిక్తుడవు రక్షకుడవు నీవే
మహిమగలవాడవు నీతి గలవాడవు
సాత్వికుడవు సత్యవంతుడ నీవే

ప్రతి మోకాలు నీకై ఒంగును
ప్రతి నాలుక నీకైపాడును (2)  || సర్వ సృష్టికి ||

3. నశించిన దానిని రక్షించుటకు
గొర్రెల కాపరిగా వచ్చిన అద్వితీయుడా (2)
తీర్పు తీర్చు వాడవు శిక్షించు వాడవు
మొదటి వాడవు కడపటి వాడవు నీవే
దీర్ఘశాంతుడవు దయగలవాడవు
జీవం గలవాడవు జీవమిచ్చు వాడవు

ప్రతి మోకాలు నీకై ఒంగును
ప్రతి నాలుక నీకైపాడును (2)  || సర్వ సృష్టికి ||

Your favourites

  • No Favourites found!