Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ Telugu Christian Song Lyrics

సర్వ యుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ Lyrics


సర్వ యుగములలో సజీవుడవు
సరిపోల్చగలనా నీ సామర్ధ్యమును
కొనియాడదగినది నీ దివ్య తేజం
నా ధ్యానం - నా ప్రాణం - నీవే యెసయ్యా

1. ప్రేమతో ప్రాణమును అర్పించినావు
శ్రమల సంఖెళ్ళైన శత్రువు కరుణించువాడవు నీవే
శూరులు నీ యెదుట వీరులు కారెన్నడు
జగతిని జయించిన జయశీలుడా

2. స్తుతులతో దుర్గమును స్ధాపించువాడవు
శ్రుంగధ్వనులతొ సైన్యమును నడిపించువాడవు నీవే
నీయందు ధైర్యమును నే పొందుకొనెదను
మరణమును గెలిచిన బహుధీరుడా

3. కృపలతో రాజ్యమును స్ధిరపరచు నీవు
బహుతరములకు శొభాతిశయముగా జేసితివి నన్ను
నెమ్మది కలింగించే నీ బాహుబలముతొ
శతృవునణచిన బహుశూరుడా

Your favourites

  • No Favourites found!