Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి Telugu Christian Song Lyrics

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి Lyrics

సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు ఉర్వి నుత్సాహముతో
గురుస్తోత్రము జేయను రండి||సర్వ||

1. ఆ ప్రభువే దేవుండు అధికస్తోత్రార్హుండు భూప్రజలు నందరిని
బుట్టించిన భగవంతుండు||సర్వ||

2. మనము దేవుని వార మును మరి యాయన ప్రజల మనయము నా
ఘనప్రభువు నెనరుతో మేపెడి గొఱ్ఱెలము||సర్వ||

3. కృతజ్ఞతార్పణలు కొల్లగను జెల్లింప నాతని యావరణములో నతి
వినయముతోఁజేరండి||సర్వ||

4. ఆయన దయామయుఁడు ఆయన కృపామయుఁడు ఆయన ప్రేమ
సత్యం బనవరతం బుండును నిజమే||సర్వ||

5. శుభనామం మదినుంచి ప్రభునామం స్తుతియించి ఘననామం బతిభక్తిన్
అనయము గొలువుడి జనులారా||సర్వ||

Your favourites

  • No Favourites found!