Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము Telugu Christian Song Lyrics

సర్వాంగ కవచము నీవే ప్రాణాత్మ దేహము Lyrics


సర్వాంగ కవచము నీవే
ప్రాణాత్మ దేహము నీవే
నా అంతరంగము నీవే దేవా (2)
నీ పోలికగ చేసి – నీ జీవమును పోసి
నా పాపమును తీసీ
నా భారమును మోసావయ్యా… యేసయ్యా
నా సర్వము నీవే నా యేసయ్యా ఓ.. ఓ..
నా ప్రాణము నీవే నా యేసయ్యా (2)

వాక్యమను ఖడ్గము నీవై – రక్షణను శిరస్త్రాణమై
సత్యమను దట్టివి నీవై నా యేసయ్యా
నీతియను మైమరువునై విశ్వాసమను డాలునై
సమాధాన సువార్త నీవై నా యేసయ్యా          ||నా సర్వము||

దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రము నీవై
బూడిదెనకు ప్రతిగా పూదండవై
దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలము నీవై
భారభరితమైన ఆత్మకు స్తుతివస్త్రమై        ||నా సర్వము||

Your favourites

  • No Favourites found!