Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును Telugu Christian Song Lyrics

సర్వశక్తుని స్తోత్రగానము సల్పరే జగమెల్లను నిర్వహించును Lyrics


సర్వశక్తుని స్తోత్రగానము
సల్పరే జగమెల్లను
నిర్వహించును దాస భారము
నిత్యమెద రాజిల్లను (2)          ||సర్వ||

ముదముతో నిర్మానకుండగు
మూల కర్తను బాడరే
వదన మీక్ష్మాన్వoచి దేవుని
వందనముతో వేడరే (2)          ||సర్వ||

వేదపారాయణము సేయుచు
విశ్వమంత జయింపరే
సాదరముగా దేవు నిక మీ
స్వాoతమున బూజింపరే (2)          ||సర్వ||

ఎదను విశ్రాంతిన్ పరేశుని
హెచ్చుఁగా నుతి జేయరే
సదమలంబగు భక్తితో మీ
సర్వ మాయన కీయరే (2)          ||సర్వ||

చావు పుట్టుక లేనివాడుగ
సంతతము జీవించును
ఈవులిచ్చుచు దన్ను వేడు మ-
హేష్టులను రక్షించును (2)          ||సర్వ||

దాసులై దేవునికి నెదలో
దర్పమును బోగాల్పరే
యేసుక్రీస్తుని పుణ్య వస్త్రము
నే మరక మైదాల్పరే (2)          ||సర్వ||

Your favourites

  • No Favourites found!