Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా సర్వపాపముఁబరిహరింప Telugu Christian Song Lyrics

సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా సర్వపాపముఁబరిహరింప Lyrics

సర్వశక్తుఁడ నిర్మలాత్ముఁడ సర్వజనసంరక్షకా మా సర్వపాపముఁ
బరిహరింప నీ సర్వమహిమను విడితివా ||సర్వ||

1. నిత్యనాశనమగ్నులగుమా నిత్యశాపముఁ బాపి మరి నీ నిత్య జీవము
మాకునీయను మృత్యు బాధలు పడితివా ||సర్వ||

2. పాపమరణపు బంధకములనుఁ దెంపి మము విడిపించుటకు మా
పాపమును భరించి మాకై యాపదల పాల్పడితివా ||సర్వ||

3. మెట్టుకీబలు దుష్టులనుచే పట్టి జీవము నిచ్చితివి కా బట్టి యిఁక నీ
కట్టడలలో దిట్టముగ బలపరుచుమీ ||సర్వ||

4. సత్యవిధులలో నడువనే న శక్తుఁడనో రక్షకా నీ భృత్యునికి శక్తి నిత్యమిడి
నడి పింపు నీ ఘనసేవలో ||సర్వ||

5. నీదు నామము మహిమపరుచను నాదు జీవితకాలమున బహు
సాధు నిగ ననుఁ జేసి సాయము నాధుఁడా నాకీయుమా ||సర్వ||

6. ప్రస్తుతము పరదేశినై ప్రచురంబుఁజేతు నీ స్తోత్రముల్ పర వస్తు
ఘనరాజ్యంబుకొరకై వాస్తవముగ నిరీక్షింతున్ ||సర్వ||

7. ముక్తినుంచి నీవు రాగా శక్తితోఁ ప్రభు యేసువా యా సక్తితో నినుఁ
గూడుకొని బహు యుక్తస్తోత్రముల్ జేతుము ||సర్వ||

Your favourites

  • No Favourites found!