సర్వశక్తుని వాక్కు యిదియే - సర్వమును మీవే
దేవుని సర్వమును మీవే
1. పౌలైన కేఫాయైన - అపొల్లోయైన - లోకమైన
ఉన్నవి మరి యేవియైన - సర్వమును మీవేగా
2. జీవమైనను మరణమైన - ప్రస్తుతమందున్నవైన
రాబోవునవియైనను - సర్వమును మీవేగా
3. దేవుని పనివారైన - దేవుని గృహమైన
దేవుని వ్యవసాయమైన - సర్వమును మీవేగా
4. భూమి ఆకాశములందు - అధికార దీవెనలు
సంఘ సంపూర్ణతయును - సర్వమును మీవేగా
5. నీరు కట్టిన తోటైన - నీటి యూటలైనను
ఫలములిచ్చు చెట్లయినను - సర్వమును మీవేగా
6. అన్ని స్వతంత్రించుకొని - దైవపుత్రులగుటయును
అవసరతల ననుభవింప - సర్వమును మీవేగా
7. క్రొత్త సృష్టి స్వాస్థ్యము - పుత్రశ్లాఘ్యమైనను
దేవుని జీవవాక్యము - సర్వమును మీవేగా
Find the Jesus Song Lyrics
We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.
Search
సర్వశక్తుని వాక్కు యిదియే సర్వమును మీవే Lyrics
Your favourites
- No Favourites found!
