Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమ సర్వాధికారి Telugu Christian Song Lyrics

సర్వోన్నత స్థలంబులో దేవునికే మహిమ సర్వాధికారి Lyrics

సర్వోన్నత స్థలంబులో - దేవునికే మహిమ
సర్వాధికారి యేసుని సిలువచే కలిగెను
అను సర్వోన్నతుండగు దేవుని - సేవకులై యుండియు
సర్వోన్నతుని చిత్తంబున - సర్వదా స్తుతియించెదము
1. పరలోక యెరూషలేమున - పరిశుద్ధుల సంఘంబు
మురియుచు భర్త యేసుకై - అరుదెంచుచుండెను
పరిశుద్ధ పట్టణమందున - ప్రభు యేసు క్రీస్తుండు
ప్రకాశమానదీపమై - ప్రజ్వలించుచు నుండె
2. దేవుని సింహాసనమున - దేవుని మహిమలో
సువర్ణ కిరీటంబుల ధరించిన పెద్దల
జీవుల మద్యనుండెను - దేవుని గొర్రెపిల్ల
ఘనత మహిమ ప్రభావము - యుగయుగములు ఆయనకే
3. స్ఫటికంబు బోలినట్టి మెరయు - జీవ జలనది
పట్టణపు వీదులలో - ప్రవహించుచుండెను
స్ఫటికంపు నది కిరుప్రక్కల - జీవ ఫలవౄక్షంబు
స్వస్థత కలిగించును - వౄక్షంపు యాకులు
4. బండలో నుండి నీటికాల్వల నిండుగ రప్పించెన్
మెండైన నదుల నీళ్ళను - దండిగ పారించెన్
బండైన క్రీస్తును చీల్చెను - ప్రభుదేవుండే మనకు
నిండార నింపు నాత్మను - తండ్రి విధేయులన్
5. మెట్టల స్థలమందున - నదుల పారచేతున్
ఈటల నెన్నో లోయల - నుబుకంగ జేతును
నీటిమడుగులుగా మార్చెద - నరణ్యము నంతటిని
నీటి బుగ్గలుగా చేతును - ఎండిన నేలను
6. దావీదు పట్టణమందున - దావీదు సంతతిలో
దేవుని సర్వశక్తితో - జన్మించె యేసుండు
దావీదు తాళము కలిగి - తన సింహాసనమందు
తావిచ్చి చేర్చుకొనును - జయించువారిని
7. సిల్వలో మరణించెను శ్రీ యేసు నా కొరకు
విలువైన రక్తము కార్చెను - మలినంబు బోగొట్టన్
బలుడైన ఆత్మ శక్తితో - గెలిచె సమాధిని
బలమిచ్చును పరిశుద్ధులకు - హల్లెలూయా పాడెదము


Your favourites

  • No Favourites found!