Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ Telugu Christian Song Lyrics

సర్వోన్నత స్థలములలో సమాధానము ప్రాప్తించె ప్రజ Lyrics


సర్వోన్నత స్థలములలో సమాధానము
ప్రాప్తించె ప్రజ కొరకు ప్రభు జన్మముతోను (2)
హల్లెలూయా అర్పణలు – ఉల్లముతో చెల్లింతుమ్
రాజాధి రాజునకు – హోసన్నా ప్రభువునకు (2)      ||సర్వోన్నత||

పశువుల పాకలో మనకు శిశువు జన్మించె
పొత్తిగుడ్డలలో చుట్టగ పవళించిన తండ్రి (2)
ఆశ్చర్యకరుడు – ఆలోచనకర్త (2)
నిత్యుండు సత్యుండు నిజ రక్షణ క్రీస్తు (2)         ||హల్లెలూయా||

మన వ్యసనములను బాప మొత్తబడుట కొరకై
మన సమాధానార్థ శిక్ష మోపబడుట కొరకై (2)
మన దోషము బాప – మానవరూపమున (2)
జనియించె బాలుండు ఇమ్మానుయేలుండు (2)         ||హల్లెలూయా||

Your favourites

  • No Favourites found!