Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ Telugu Christian Song Lyrics

శాశ్వతమా ఈ దేహం త్వరపడకే ఓ Lyrics


శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా…

శాశ్వతమా ఈ దేహం
త్వరపడకే ఓ మనసా (2)

క్షణికమైన ఈ మనుగడలో
పరుగులేలనో అనుక్షణము
నీటిపైన చిరు బుడగ వోలె – (2)
దేహము ఏ వేళా చితికిపోవునో        ||శాశ్వతమా||

ఈ లోకములో భోగములెన్నో
అనుభవించగా తనవి తీరేనా
నీ తనువే రాలిపోయినా – (2)
నీ గతి ఏమో నీకు తెలియునా        ||శాశ్వతమా||

దేహ వాంఛలను దూరము చేసి
ఆ ప్రభు యేసుని శరణము కోరి
నీతి మార్గమున నడుచుకొందువో – (2)
చిరజీవముతో తరియించేవు        ||శాశ్వతమా||

Your favourites

  • No Favourites found!