Jesus Telugu Songs

Find the Jesus Song Lyrics

We have a growing collection of Telugu Christian song lyrics and are continuously adding more every day.

Search
సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు, Telugu Christian Song Lyrics

సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు, Lyrics


సత్తువభూమిలో శ్రేష్టమైన ద్రాక్షతీగలను నాటించిన దేవుడు, నీవు ఫలిస్తే సంతోషిస్తాడు..


ఫలములనాసించిన పరలోకతండ్రి - తేరిచూచుచున్నాడు నీ వైపు - 2
ప్రేమతో నిను పెంచిన ప్రియ తోటమాలి - పరిక్షించుచున్నాడు నీ కాపు - 2
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2


1. ఐగుప్తునుండి పెరికి తెచ్చినాడు - సంఘద్రాక్షతోటలో నిన్ను నాటినాడు - 2
చుట్టు త్రవ్వి ఎరువు వేసి - నీరుపోసినాడు - 2
తన స్వాస్థ్యముగా నిను - ప్రత్యేకపరచినాడు - 2
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2


2. వెదకినపుడు నీ యొద్ద ఫలములేకయుంటే - ఆకులతో నిను చూసి తండ్రి సంతసించునా- 2
ఇవ్వబడిన సమయములో - వర్ధిల్లకుంటే - 2
మోడులాంటి నిన్ను ఇంక - నరికివేయకుండునా - 2
ఫలియించకుండుట నీకు న్యాయమా - యజమాని సహనముతో చెలగాటమా..? - 2

Your favourites

  • No Favourites found!